మన ప్రవక్త విల్లియం బ్రెన్ హాం గారిచే ప్రసంగించ బడిన "ఏడు సంఘకాలములు".
ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికి శుభమని చెప్పి వ్రాయునది،
ఈ ఆండ్రాయిడ్ "ఏడు సంఘకాలములు" అప్లికేషన్ ను ప్రపంచమందున్న తెలుగు అంత్యకాల వర్తమాన ప్రజలకు ఉచితముగా అందించుచున్నాము.
దీనిలో మీకు అన్నీ విధాల అనుకూలమైన చాలా సులభ పద్దతిన ఏడు సంఘకాలములు పొందు పరచటమైనది.
మీరు మీకు కావలసిన సంఘకాలమునకు మెను ఆప్సన్ ద్వారా మీకు కావలసిన పారా నెంబరుకు అంటే ఉదాహరణకు ఎపెస్సు సంఘకాలము పుస్తకంలో మొత్తం 121 పారాలున్నవి వాటిలో మీరు కావలసిన 47 లేక మరేదైన 1 నుండి 121 వరకు సులభంగా వెళ్ళవచ్చు.
మీకు నచ్చిన పారాలను نکات లో మీకు కావలసిన పేరుతో భద్రపరచుకొని ఇతరులకు కూడ పంపవచ్చును.
మీరు చదివిన వాటిని బుక్ మార్క్ కూడ చేసుకోవచ్చు.
మీకు కావలసిన పదాలను جستجو ఆప్పన్ ద్వరా త్వరగా వెదకవచ్చు మరియు దానిని క్లిక్ చేసిన వెంటనే సంబందిత బుక్ ని మీరు చదువగలరు.
ఇలా చాలా చదువుటకు సులభంగా ఉండేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ తయారు చేయటం జరిగినది.
మరి మీరు దీనిని చదువుచుండగా పలాన ఆప్సన్ ఉంటే బాగుండేది అనుకున్న పాయింట్ ను మీరు పీడ్ బ్యాక్ ద్వార్ మాకు తెలియజేయ గలరు.
మరియు ఇంకనూ ఈకాలపు ప్రవక్తయైన విల్లియం బ్రెన్ హాం ద్వారా ఆంగ్ల భాషలో ప్రసంగించబడి ఇప్పటి వరకు తెలుగు తర్జుమా అయిన పుస్తకాలను అనగా "ఏడు ముద్రల ప్రత్యక్షత" మరియు మిగతా వాటిని కూడ మీకు అందించాలన్నదే మా యొక్క గట్టి విశ్వాసమైయున్నది.
ఈ పని మరింత ముందుకూ సాగులాగు మన ప్రభువైన యేసుక్రీస్తుకు మీకు వ్యక్తిగత ప్రార్ధనలో మమ్ములను జ్ఞానపకం చేసుకొన వలసినదిగా మా యొక్క విన్నపం.
దీనిని తగురీతిలో ఉపయోగించుకొని దేవుని ఆశ్వీర్వాదం పొందవలెనని మేము ఆశిస్తున్నాము.